వెంకటేష్ మరో మల్టీస్టారర్.. ఈ సారి నేచురల్ స్టార్‌తో..Venkatesh
2019-12-12 01:43:43

తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ మల్టీస్టారర్ ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన హీరో వెంకటేష్. సీతమ్మ వాకిట్లో సినిమాతో దాదాపు పాతికేళ్ల తర్వాత మల్టీస్టారర్ వచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసాడు ఈయన. ఇప్పుడు కూడా మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి వెంకీ మామలో నటించాడు. ఈ సినిమా డిసెంబర్ 13న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత కూడా వెంకీ డైరీ ఫుల్ అయిపోయింది. ఈయన ఇప్పటికే 'అసురన్' రీమేక్ లో నటించడానికి కమిటయ్యాడు. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించబోయే ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు సురేష్ బాబు. అసురన్ రీమేక్ తర్వాత ఆకుల శివ చెప్పిన కథకు వెంకీ ఫిదా అయ్యాడని తెలుస్తుంది. ఈ కథ సురేశ్ బాబుకి కూడా చాలా బాగా నచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఓ మల్టీస్టారర్. ఇందులో వెంకటేష్ ఓ హీరోగా నటిస్తే.. మరో హీరోగా నాని కోసం ప్రయత్నాలు చేస్తున్నారు సురేష్ బాబు. నాని అయితేనే ఈ పాత్రకు బాగుంటుందనే అభిప్రాయాన్ని సురేశ్ బాబు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో నాగార్జునతో 'దేవదాసు' చేసిన నాని, వెంకటేష్ తోను కలిసి నటిస్తే అభిమానులకు పండగే. మొత్తానికి తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్ రోజురోజుకీ పెరుగుతుంది. 

More Related Stories