ఎఫ్ 3 కోసం భారీగా చెల్లింపులు చేయబోతున్న దిల్ రాజు 



F3
2020-12-17 17:41:36

ఈ ఏడాది ఆరంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనీల్ రావిపూడి వెంటనే ఎఫ్ 3 సినిమాను పట్టాలెక్కించాలని భావించినా కూడా కరోనా కారణంగా సాధ్యం కాలేదు. నేడు లాంచనంగా ఎఫ్ 3 సినిమా పూజా కార్యక్రమాలు షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కేవలం పూజా కార్యక్రమాలు మాత్రమే కాకుండా ఈ నెల 23 నుండి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. 

లేటేస్ట్ గా ఈ సినిమా కోసం దిల్ రాజు భారీగా రెమ్యూరేషన్లు ఇస్తున్నారని, వార్తలు బయటకు వచ్చాయి.ఆ వివరాల ప్రకారం సినిమా రెమ్యూనిరేషన్లకే యాభై కోట్ల వరకు అయిపోతుందని తెలుస్తోంది. హీరో వెంకటేష్ కు12 కోట్లు, వరుణ్ తేజ్ కు 8 కోట్లు, తమన్నాకు రెండు కోట్లు, మెహరీన్ కు 70లక్షలు, కమెడియన్ సునీల్ కు 75 లక్షలు, దేవీశ్రీ ప్రసాద్ కు మూడు కోట్లు, డైరక్టర్ అనిల్ రావిపూడికి 12 కోట్లు ఇలా వున్నాయట రెమ్యూనిరేషన్లు. ఇవి కాక యాక్టర్లు, టెక్నీషియన్లు, షూటింగ్  కలిపి యాభై  కోట్లు దాటేస్తాయని టాక్. ఎందుకంటే ఎఫ్ 3 సీక్వెల్ కావడంతో తాము కచ్చితంగా నటించడానికి ఒప్పుకోవాల్సి వుండడంతో, హీరోలు ఇద్దరూ మామూలుగా డిమాండ్ చేయలేదని పలు గ్యాసిప్ లు వున్నాయి. 

More Related Stories