వెంక‌టేష్‌ సూపర్ స్పీడ్ .. దృశ్యం 2 పూర్తి 



Venkatesh
2021-04-15 12:50:46

మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ ‘దృశ్యం’ కి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ వచ్చిన సంగతి తెలిసిందే.  అంచ‌నాల‌ను రెట్టింపు చేస్తూ ‘దృశ్యం 2’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో ఇప్పుడు సీక్వెల్ కూడా రీమేక్ చేసే ఆలోచ‌న‌లో ప‌డ్డారు. కొద్ది రోజుల క్రితం వెంక‌టేష్ రీమేక్ మొద‌లు పెట్ట‌గా, ఈ సినిమాను రెండు నెల‌లో పూర్తి చేసి ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. గ‌త కొద్ది రోజులుగా చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా, తాజాగా వెంక‌టేష్ షూటింగ్ పూర్తైందట‌. ఈ విష‌యాన్ని నిర్మాత త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. సీనియర్ నరేష్, నదియా కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు.

More Related Stories