వెంకీ మామ మూడు రోజుల కలెక్షన్స్ Venky Mama
2019-12-16 19:57:48

నిజజీవితంలో మామా అల్లుళ్ళు అయిన వెంకటేష్, నాగ చైతన్యలు మామా అల్లుళ్ళుగా కలిసి నటించిన సినిమా ‘వెంకీ మామ’. దర్శకుడు బాబీ డైరెక్షన్ లో నటించిన ‘వెంకీ మామ’ సినిమా మొన్న శుక్రవారం విడుదలై మాంచి పాజిటివ్ టాక్ తో దూసుకు వెళుతోంది. ఈ సినిమా టాక్ బాగుండడంతో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను సాధిస్తోంది. ఆంధ్ర, నైజాం మరియు సీడెడ్ ప్రాంతాలలో బాక్సాఫీస్ వద్ద వెంకీ మామ భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. ఆదివారం నాడు కూడా ఈ సినిమా రూ .5 కోట్ల ప్లస్ షేర్‌ ను కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇక ఈ సినిమా మొత్తం 3 రోజుల్లో రూ . 17.78 కోట్ల మార్క్ అధిగమించిందని చెబుతున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడంతో దాదాపు రూ .45 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్లు సినిమా నిర్మాతలు కూడా అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ రోజు నుంచి వీక్ మొదలవుతుంది కాబట్టి అందరికీ వర్కింగ్ డేస్ ఉంటాయి కాబట్టి కలెక్షన్స్ ఎలా వస్తాయో చూడాలి. 

More Related Stories