వెంకీమామ కలెక్షన్స్..బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరం అంటేvenky
2019-12-24 11:56:03

రియల్ లైఫ్ మామ అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలసి నటించిన సినిమా వెంకీమామ. డైరెక్టర్ బాబీ దర్శత్వంలో సురేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 13న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. చిత్ర సక్సెస్‌పుల్‌గా రెండో వారం దాటింది.  వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్… నాగ చైతన్య సరసన రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రెండవ వారం దాటినా డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతుంది. బాక్సాఫీస్ వద్ద 10 రోజుల కలెక్షన్స్ ని తాజాగా ట్రేడ్ రిపోర్ట్స్ వెల్లడించాయి. ఈ సినిమా పది రోజుల కలెక్షన్స్ ని పరిశీలిస్తే నైజాం 10.04 cr, సీడెడ్ 4.19 cr, ఉత్తరాంధ్ర 3.91 cr, ఈస్ట్ 2.02 cr, వెస్ట్ 1.25 cr, కృష్ణా 1.52 cr, గుంటూరు 2.01 cr, నెల్లూరు 0.88 cr, రెస్ట్ ఆఫ్ ఇండియా 2.53 cr, ఓవర్సీస్ 3.06 cr వరల్డ్ వైడ్ టోటల్ మొత్తం చూస్తే 31.40 కోట్లు షేర్ సాధించింది. 'వెంకీమామ' సినిమాకి 32.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగగా 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా 31.40 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ దగ్గరలోకి చేరింది. 

More Related Stories