వెంకీమామ ఫస్ట్ డే కలెక్షన్స్Venky Mama
2019-12-14 20:28:36

వెంకటేష్, నాగ చైతన్య మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’.. వెంకీ బర్త్ డే సందర్భంగా నిన్న విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్‌‌ను రాబట్టింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిజంగా మామా అల్లుళ్ళు అయిన వెంకీ-నాగ చైతన్యలు మామా అల్లుళ్లుగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఫుల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో  పాయల్‌ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటించారు. సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకి మిక్సెడ్ రివ్యూలు వచ్చాయి. కొందరు చాలా బాగుందని నెత్తిన పెట్టుకుటే మరికొందరు రొటీన్ రొట్ట అంటూ తేల్చేసారు. 

ఈ నేపధ్యంలో ఈ సినిమా కలెక్షన్స్ పరిశీల్సితే  ` దేశ, విదేశాల్లో చాలా చోట్ల ప్రదర్శించబడిన ఈ సినిమా మొదటి రోజే 13.7 కోట్ల మేర రాబట్టిందని రిపోర్ట్స్ ఆధారంగా చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి వెంకీమామ సినిమా 10 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ రాబట్టిందని సమాచారం. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో వెంకీమామ 27.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా 2.7 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్‌లో 2.8 కోట్లు, ఇక మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. 33.1 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా 34 కోట్ల టార్గెట్‌తో వెంకీమామ బరిలోకి దిగాడు. ఈ వారంలో సినిమాలు ఏవి పోటీగా లేకపోవడం కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ కానుంది. అయితే వచ్చే శుక్రవారానికి రూలర్, దొంగ, ప్రతిరోజు పండగ చిత్రాలు వరస రిలీజ్ లు ఉండటంతో వాటికి  ఏ మాత్రం పాజిటివ్ టాక్ ఉన్నా ఆ ప్రభావం వెంకీ మామపై పడే అవకాశం ఉంది. కాబట్టి వెంకీ మామ ఈ వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడిని రాబట్టాల్సి ఉంటుంది.   

More Related Stories