పంచెకట్టులో మెరిసిపోతున్న వెంకీమామvenky
2019-09-02 19:52:27

హీరో వెంకటేష్ ఆయన మేనల్లుడు అక్కినేని నాగచైతన్యలు కలసి మామా అల్లుళ్ళుగా నటిస్తున్న సినిమా వెంకీ మామ. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా పాయల్ రాజ్ పుత్,  నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటించనున్నారు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.  ఈ చిత్రంలో వెంకీ రైస్ మిల్ ఓనర్ గా, చైతు ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు  వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది.

ఈ పోస్టర్ లో వెంకీ, చైతు ఎర్ర కుర్తా, పంచె కట్టులో కలర్ ఫుల్ గా మెరిసిపోతున్నారు. ఇక ఈ సినిమా దసరాకు విడుదల కానుందని ముందు నుదీ అనుకున్నా అది కష్టమేనని తెలుస్తోంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రిందట వెంకటేష్ కాలు బెణకటం వలన ఈ సినిమా షూట్ ఆలస్యం అయ్యిందని, అందుకే అనుకున్న సమయానికి విడుదల చేయడం కష్టమేనని చెబుతున్నారు. కాలు బెణకటంతో వెంకటేష్ ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని అంటున్నారు. ఎఫ్2 లాంటి హిట్ తో వెంకటేష్ మజిలి లాంటి హిట్ తో చైతు మాంచి హుషారుగా ఈ సినిమా చేస్తున్నారు. 

More Related Stories