వెంకీమామ వెనక్కి వెళ్తున్నాడా ?Venky Mama
2019-08-17 11:57:59

సీనియర్ హీరో వెంకటేష్ ఆయన రియల్ లైఫ్ మేనల్లుడు అక్కినేని నాగచైతన్యలు కలసి మామా అల్లుళ్ళుగా కలిసి నటిస్తున్న సినిమా వెంకీ మామ. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా పాయల్ రాజ్ పుత్,  నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటించనున్నారు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే అప్పుడు సైరా సినిమా రిలీజ్ ఉంటుదని ఈ సినిమా వాయిదా పడచ్చని ప్రచారం జరిగింది. ఆ ప్రచారం జరిగినట్టే ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెంకీ మామ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయాలని ముందుగా నిర్మాతలు భావించారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం వెంకీ మామ సినిమా దసరాకు విడుదల కావటం కష్టమేనని తెలుస్తోంది. ఎందుకంటే వెంకటేష్ కాలు కొన్ని రోజుల క్రిందట బెణకటం వలన ఈ సినిమా షూట్ ఆలస్యం అయ్యిందని, అందుకే అనుకున్న సమయానికి విడుదల చేయడం అంటే కష్టమేనని చెబుతున్నారు. కాలు బెణకటంతో వెంకటేష్ ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని అంటున్నారు. వెంకటేష్ చైతూ కాంబినేషన్లో దర్శకుడు తెరకెక్కించాల్సిన సన్నివేశాలు ఇంకా చాలా ఉన్నాయని చెబుతున్నారు. ఈ విషయాల మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఎఫ్2 లాంటి హిట్ తో వెంకటేష్ మజిలి లాంటి హిట్ తో చైతు మాంచి హుషారుగా ఈ సినిమా చేస్తున్నారు. చైతు మిలిటరీ ఆఫీసర్ గా వెంకీ స్వంత ఊళ్ళో వ్యవసాయం చేసే మాడరన్ రైతుగా నటిస్తున్నారని టాక్.  

More Related Stories