ఎందుకంత తొందర.. చావకముందే చంపేస్తారా..Venumadhav serious.jpg
2019-09-25 11:42:50

సీనియ‌ర్ కమెడియన్ వేణు మాధవ్ చనిపోయాడు.. ఆయన ఇక లేరు.. క‌న్నుమూసారు.. హైదరాబాద్ యశోదలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారంటూ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా సెప్టెంబర్ 24న చాలా సేపు వార్తలు వచ్చాయి. కానీ తెల్లారేస‌రికి అంతా మారిపోయింది. చికిత్స‌కు స్పందిస్తున్న వేణు మాధవ్ అంటూ వార్త‌లొచ్చాయి. దాంతో అంతా షాక్. అదేంటి రాత్రి చ‌నిపోయిన ఆయన పొద్దున్నే ఎలా బ‌తికేసాడు అని..? ఓహో.. ఇదంతా మీడియా నిర్వాక‌మా అంటూ అప్పుడు నిట్టూరు స్తున్నారు జ‌నాలు. రోజుల్లో పోటీ ప్ర‌పంచం బాగా ఎక్కువైపోయింది. ఎవ‌డు ముందు చెబితే వాడే తోపు. అందుకే అప్పుడ‌ప్పుడూ కాస్త తొంద‌ర‌పాటు కూడా ఉంటుంది. ఎంత‌లా అంటే బ‌తికుండగానే చంపేసేంత‌..? 

అక్క‌డ ఆక్సీజ‌న్ పైప్ పెట్టారు అంటే ఇక్క‌డ లాగేసారు అని చెప్పేంత తొంద‌ర‌పాటు ఇప్పుడు మీడియాలో క‌నిపిస్తుంది. అది హాలీవుడ్ యాక్ట‌ర్ సిల్వెస్ట‌ర్ స్టాలిన్ కానీ.. బాలీవుడ్ యాక్ట‌ర్ అమితాబ్ బ‌చ్చ‌న్ కానీ.. మ‌న ద‌గ్గ‌ర జ‌యంతి కానీ.. వేణు మాధవ్ గానీ.. మొన్నటికి మొన్న ఒకరోజు ముందే చంపేసిన శివ ప్రసాద్ కానీ.. ఎవ‌రైనా కానీ వాళ్లు చ‌నిపోక ముందే చ‌నిపోయారు అని ర‌చ్చ ఎందుకు చేయ‌డం..? ఒక్క‌సారి చేసిన త‌ర్వాత ఆకులు ఎందుకు ప‌ట్టుకోవ‌డం..?  ఇది మొద‌టిసారి అయితే ఏదో అనుకోవ‌చ్చు..? ఓ మ‌నిషికి సీరియ‌స్ గా ఉందంటే అత‌డు చ‌నిపోయాడు అని కాదు క‌దా అర్థం. బ‌త‌క‌డానికి ట్రై చేస్తున్నాడ‌ని క‌దా..? క‌నీసం అది కూడా అర్థం చేసుకోక‌పోతే ఎలా..? 

చ‌నిపోయిన త‌ర్వాత ఎలాగూ వ‌ద‌ల‌రు.. క‌నీసం బ‌త‌కడానికి పోరాటం చేస్తున్న‌పుడైనా వ‌దిలేయొచ్చు క‌దా..? మీడియా అన్నీ చూపించాలి కానీ అబ‌ద్ధాల‌ను కాదు. రాజ‌కీయ ప‌రంగా ఎన్ని అబ‌ద్ధాలైనా చూపించండి.. సినిమాల ప‌రంగా మీ ఇష్టం.. ఎందుకంటే అది ఎవ‌రికీ పెద్ద‌గా యూజ్ ఉండ‌దు.. ప‌ట్టించుకోరు కూడా. కానీ చావుల ద‌గ్గ‌ర మాత్రం అంత తొంద‌ర ఎందుకో అని కొంద‌రు బాహాటంగానే మీడియా తీరును త‌ప్పు ప‌డుతున్నారు. గ‌తంలో ఎమ్మెస్ నారాయ‌ణ విష‌యంలో ఇదే జ‌రిగింది. ఆయ‌న చ‌నిపోవ‌డానికి ఒక్క‌రోజు ముందే చ‌నిపోయాడ‌ని ఫిక్స్ చేసారు. పాపం.. ఆ బాధ త‌ట్టుకోలేకేనేమో ఒక్క‌రోజులో ఆయ‌న లోకం విడిచి వెళ్లిపోయారు. మ‌రి ఈ తీరు ఎప్ప‌టికి మారుతుందో ఏమో..? 

More Related Stories