పవన్ కళ్యాణ్ డెడికేషన్ చూసి మెంటల్ వచ్చేసిందన్న దర్శకుడు..venu sriram
2020-04-22 22:38:45

పవన్ కళ్యాణ్ కి సినిమాలంటే ఇంట్రెస్ట్ లేదు.. ఆయన రాజకీయాల్లో ఉంటాడు.. ఇష్టం లేకుండా సినిమాలు చేస్తున్నాడు.. అనవసరంగా నిర్మాతలను దర్శకులను ఇబ్బంది పెడుతున్నాడు.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వచ్చిన విమర్శలు ఇవే. కేవలం డబ్బుల కోసం మాత్రమే సినిమాలు చేస్తున్నాడు అంటూ ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ డెడికేషన్ గురించి ఒక దర్శకుడు మాట్లాడాడు. ఒక్కసారి ఆయన సినిమా కోసం కమిట్ అయితే ఎలా ఉంటుందో చెప్పాడు. అతను ఎవరో కాదు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమా చేస్తున్న శ్రీరామ్ వేణు. పింక్ సినిమా రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. 

ఇప్పటికే షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ కరోనా వైరస్ సెలవులు రాకపోయి ఉంటే ఈ పాటికి షూటింగ్ పూర్తి అయిపోయేది. మే 15న విడుదల కావాల్సి ఉంది. అయితే కొంత భాగం మాత్రమే ఇంకా మిగిలి ఉంది అంటున్నారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే వకీల్ సాబ్ షూటింగ్ మొదలైన తర్వాత పవన్ కళ్యాణ్ ఒక్కరోజు కూడా షూటింగ్ మిస్ కాలేదని చెప్పాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఓ వైపు రాజకీయాలు.. మరోవైపు యాక్టింగ్.. ఈ రెండింటిని ఆయన బ్యాలెన్స్ చేసిన విధానం చూసి తనకు ఆశ్చర్యం వేసిందన్నాడు. 

అంత బిజీ షెడ్యూల్ లో కూడా  ఏ ఒక్కరోజు తమ షూటింగుకు ఆలస్యం చేయడం కానీ.. మిస్ చేయడం గానీ చేయలేదని చెప్పాడు. విజయవాడ-హైదరాబాద్ మధ్య అవిశ్రాంతంగా ప్రయాణించారని.. ఈ సినిమా కోసం నిత్యం 600 కిలోమీటర్లు ప్రయాణించేవారని.. సినిమా పట్ల పవన్ కళ్యాణ్ కు ఉన్న అంకిత భావంతో తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయిందని తెలిపాడు వేణు శ్రీరామ్. ఇప్పటికే ఈ సినిమాలో ప్రధానమైన సన్నివేశాలు చిత్రీకరించామని.. లాక్ డౌన్ తర్వాత మిగిలిన భాగం కూడా పూర్తి చేస్తామని చెప్పాడు వేణు శ్రీరామ్. 

More Related Stories