బాలీవుడ్ లో మరో విషాదం Jagdeep
2020-07-09 16:44:05

బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కరోనాతో కొంత మంది మరణించగా, కారణం తెలీదు కానీ సుశాంత్ రాజ్ పుట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక తాజాగా ప్రముఖ బాలీవుడ్ హాస్యనటుడు జగదీప్ మరణించారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో నిన్న రాత్రి 8గంటల 40నిమిషాలకు ముంబైలోని తన ఇంటిలో చనిపోయారు. జగదీప్ అసలు పేరు సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ. జగదీప్ 400కి పైగా సినిమాల్లో నటించారు. 1975లో షోలే సినిమాలో సుర్మా భోపాలి పాత్రతో అందరికీ జగదీప్ దగ్గరయ్యాడు. జగదీప్ చివరి సినిమా గల్లీ గల్లీ చోర్ హై.  ఇందులో ఆయన పోలీసు కానిస్టేబుల్ పాత్రను పోషించారు. ముంబైలోని షియా ఖబర్‌ స్తాన్‌ లో రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పుడు ఆయన మృతికి బాలీవుడ్‌ ప్రముఖులు, నటీనటులు ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

More Related Stories