తమిళ సీనియర్ హీరో కార్తీక్ కు తీవ్ర అస్వస్థతactor Karthik
2021-03-22 14:46:10

తమిళ సీనియర్ హీరో కార్తీక్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంత కాలంగా కార్తిక్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. మరోవైపు రాజకీయాల్లోను ఆయన చురుకుగా ఉన్నారు. కార్తీక్ మనిద ఉరిమై కట్చి పార్టీ  స్థాపించి గత ఎన్నికల్లో పోటీ చేసారు. అయితే ఈసారి కూడా ఆయన ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అన్నాడీఎంకే పార్టీకి మద్దతు ప్రకటించారు. దాంతో ఈ కూటమి తరపున ఆయన ప్రస్తుతం ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే శనివారం ప్రచారం ముగించుకుని ఇంటికి చేరుకున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో వెంటనే కుటుంబ సభ్యులు కార్తీక్ ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా అతడు శ్వస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే తెలుగులో సీత కొక చిలక, అన్వేషణ, అభినందన సినిమాల్లో నటించి అలరించారు. ఇక చివరగా కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఓం 3డి సినిమాలో నటించి అలరించారు.

More Related Stories