కరోనాతో ప్రముఖ గాయకుడు సంగీత దర్శకుడు మృతి



G Anand
2021-05-07 12:09:11

కరోనా మహమ్మారి టాలీవుడ్ లో మరో విషాదాన్ని నింపింది. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు జి ఆనంద్ (67) కరోనాతో కన్స్ మూశారు. కొద్ది రోజుల క్రితం ఆయన కరోనా బారిన పడ్డారు. అయితే పరిస్థితి విషమించాక వెంటిలేటర్ లభించకపోవడంతో ఆయన కన్ను మూశారు. ఆనంద్ శ్రీకాకుళం జిల్లా పులగమ్ గ్రామంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు గేదెల ఆనందరావు. చిన్నతనంలోనే ఆయన తండ్రి వద్ద సంగీతం నేర్చుకున్నారు. దాంతో బాల్యం నుండే ఆయన పాటలు పాడటం మొదలు పెట్టారు. 

ఇక ఓ పాటల ప్రోగ్రాం లో సంగీత దర్శకుడు కేవీ మహదేవన్, ఎస్పీబి అతిధులు గా హాజరయ్యారు. ఆ షోలో ఆనంద్ విజేతగా నిలిచారు. ఆ సమయంలోనే మహదేవన్ ఆనంద్ ను చెన్నై కి రావాలని చెప్పారు. అలా చెన్నై వెళ్లిన ఆనంద్ "గాంధీ నగర్ రెండో వీధి" అనే సినిమాతో సంగీత దర్శకుడుగా పరిచయం అయ్యారు. ఆ తరవాత అంబేద్కర్ , రంగవల్లి లాంటి ఎన్నో సినిమాలకు స్వరాలు సమకూర్చారు. అంతే కాకుండా సినిమాల్లో అవకాశాలు తగ్గిన తరవాత ఆనంద్ దాదాపు 6,500 సంగీత కచేరీలు చేశారు. అమెరికాలో సైతం సంగీత కచేరీలు నిర్వహించిన ఆయన అక్కడే స్థిరపడ్డారు.

More Related Stories