ఆ హీరో క్రాక్ కి నో చెప్పాడటKrack
2021-01-13 13:24:02

మాస్ మహారాజ్ రవితేజ సంక్రాంతి కానుకగా "క్రాక్"తో  ఫ్యాన్స్ కు మాస్ బిరియాని వడ్డించాడు. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా అలరించాడు. సినిమా మొదటిరోజు విడుదలలో కొన్ని అడ్డంకులు ఎదురైనా బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాతో రవితేజ , గోపీచంద్ మలినేని కాంబో హ్యాట్రిక్ కొట్టింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

దర్శకుడు గోపిచంద్ మలినేని ఈ సినిమా కథను మొదట విక్టరీ వెంకటేష్ కు చెప్పాడట. అయితే వెంకటేష్ కు కథ అంత భాగా నచ్చలేదట. దాంతో కథలో కొన్ని మార్పులు చేయాలని కోరాడట. కానీ తన కథపై భాగా నమ్మకం ఉన్న గోపిచంద్ కథలో మార్పులు చేయలేదు. దాంతో వెంకీ ఈ కథకు నో చెప్పాడని టాక్. దాని తరవాత  ఇదే కథను తీసుకుని గోపిచంద్ రవితేజ దగ్గరకు వెళ్లాడట. తనకు రెండు హిట్లు ఇచ్చిన గోపిచంద్ పై నమ్మకంతో రవితేజ వెంటనే ఒకే చెప్పసడట. ఇంకేముంది మొత్తానికి రవితేజ, గోపిచంద్ కాంబినేషన్ లో వచ్చిన మరో సినిమా కూడా సక్సెస్ అయ్యింది.

More Related Stories