విజయ్ విజిల్ మూవీ రివ్యూBigil movie review
2019-10-25 13:40:51

విజయ్ హీరోగా నయనతార హీరోయిన్ గా విజయ్ తో మెర్సల్, తేరీ వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “బిగిల్”. ఈ చిత్రాన్ని తెలుగులో “విజిల్” పేరిట ఈ రోజే విడుదల చేశారు. ఈ సినిమన్ అటు తమిళ్ ఇటు తెలుగులో కూడా భారీ అంచనాల నడుమ విడుదలయ్యింది. మరి ఈ సినిమా అంచనాలను అందుకున్నదా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :
మైఖేల్(విజయ్) ఒక ఫుట్ బాల్ ప్లేయర్. కానీ కొన్ని అనూహ్య పరిణామాల వలన చేత తాను బలంగా అనుకున్న లక్ష్యానికి దూరం అయ్యిపోతాడు.అయితే ఇదే నేపథ్యంలో కొంత కాలం తర్వాత ఒక మహిళా ఫుట్ బాల్ టీమ్ కు కోచ్ గా నియమించబడతాడు.ఇలా నియమించబడ్డ విజయ్ ఏం చేసాడు? అసలు ఈ సినిమాలో “బిగిల్” అనే పాత్రకు, ఏజ్డ్ విజయ్ కు ఈ మైఖేల్ కు ఉన్న సంబంధం ఏమిటి?ఇద్దరి స్టోరీనా లేక ఒకరి స్టోరీనే ఇద్దరిలా తీసారా వాటన్నిటిని అట్లీ ఎలా తెరకెక్కించారు అన్న అన్ని ప్రశ్నలకు సమాధానం తెల్సుకోవాలి అంటే ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాను వెండి తెరపై చూడాల్సిందే.

రాజప్ప (విజయ్) అనే రౌడీ కుమారుడు మైఖేల్ ఉరఫ్ బిగిల్ (విజయ్) జాతీయ జట్టుకు ఆడాలనే ఫుట్‌బాల్ క్రీడాకారుడు. తన కుమారుడు మైఖేల్ జాతీయ స్థాయిలో చాంఫియన్‌గా నిలిచి కప్పు సాధిస్తే చూడాలనే కోరికతో రాజప్పకి బలంగా ఉంటుంది. అయితే ఉన్నతమైన ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా మారే అవకాశం ఉన్న మైఖేల్ జీవితంలో చోటు చేసుకొన్న కొన్ని కారణాల వల్ల తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని రౌడీగా మారతాడు. అయితే అనూహ్యంగా మైఖేల్ కొంత కాలం తర్వాత ఒక మహిళా ఫుట్ బాల్ టీమ్ కు కోచ్ గా నియమించబడతాడు. అయినా అసలు తండ్రి రాజప్ప రౌడీ బాటలో మైఖేల్ ఎందుకు నడవాలని నిర్ణయం తీసుకొన్నాడు? ఫుట్‌బాల్ క్రీడను మైఖేల్ వదిలేయాల్సినంత అవసరం ఏం వచ్చింది. కోచ్‌గా మారాక తనకు ఎదురైన ప్రతికూల పరిస్థితులను ఎలా అధిగమించాడు ? అనే అన్ని ప్రశ్నలకు సమాధానం తెల్సుకోవాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే.

విశ్లేషణ :

ఆడదానివి నువ్వు ఏం చేయగలవు.. వంటింట్లో కూర్చోడం తప్ప, ఇప్పటికీ మన సమాజంలో ఈ భావన ఉంది. అయితే ఆ భావన పోగొట్టడానికి దర్శకుడు అట్లీ చేసిన ప్రయత్నం విజిల్, దానికి విజయ్ లాంటి సూపర్ స్టార్ తోడయ్యాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కన పెడితే కథాపరంగా విజిల్ చాలా బాగుంది. అనుకుంటే అమ్మాయిలు ఏదైనా సాధిస్తారు అని సినిమాలో చూపించాడు దర్శకుడు. కాకపోతే తాను అనుకున్న కథను కమర్షియల్ గా చెప్పడంలో అట్లీ కాస్త తడబడినట్లు అనిపించింది. పోలీసోడు, అదిరింది సినిమాలను దృష్టిలో పెట్టుకుని వెళితే కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. కథనంలో అట్లీ కాస్త వీక్ అయ్యాడు కానీ.. కథ విషయంలో మాత్రం కాదు. ఫస్టాఫ్ లో మాస్ కు నచ్చే లా కమర్షియల్ అంశాలు జోడించే క్రమంలో కాస్త అరవ వాసనలు ఎక్కువగా కనిపించాయి. కానీ ఇంటర్వెల్ బ్లాక్ నుంచి సినిమా స్థాయి మారిపోయింది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఒక్కసారి ఉమెన్స్ ఫుట్ బాల్ టీం గ్రౌండ్ లోకి అడుగు పెట్టిన తర్వాత విజిల్ టైటిల్ కి తగ్గట్లే కొన్ని చోట్ల విజిల్ వేయిస్తుంది.
నటీనటులు : విజయ్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు, ఫుట్బాల్ కోచ్ పాత్రలో పెద్దాయన రాజప్ప పాత్రలో రెండింటిలోనూ బాగానే నటించాడు విజయ్. నయనతార కూడా బాగానే నటించింది. విజయ్ తో ఆమె కెమిస్ట్రీ బాగుంది. 

టెక్నికల్ టీమ్ :

దర్శకుడు అట్లీ విషయానికి వస్తే కథలో కొత్తదనం లేదు. అయితే తాను చెప్పాలనుకున్న పాయింట్ అభిమానులతో పాటు సగటు ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా తీశారు. కానీ దాని కోసం సినిమాను కొన్ని అనవసరమైన సన్నివేశాలతో నింపేసి నిడివి పెంచినట్టు అనిపించింది. సెకండాఫ్ మీద దర్శకుడు పెట్టిన శ్రద్ద ఫస్ట్ హాఫ్ మీద కూడా పెట్టి ఉంటే బాగండేది. ఇక ఏ ఆర్ రెహమాన్ అందించిన పాటలు పర్వాలేదనిపించినా కొన్ని కొన్ని కీలక సన్నివేశాల్లో ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లిందనే చెప్పాలి. జికె విష్ణు అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇక తెలుగు డబ్బింగ్ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించారన్న విషయం అర్ధం అవుతోంది.

ఫైనల్ గా : విజిల్.. ఆడవాళ్ళ కోసం చేసిన ఒక మంచి ప్రయత్నం..

రేటింగ్: 2.75/5.

More Related Stories