కొత్తింటి గృహప్రవేశం చేసిన విజయ్ దేవరకొండvijay
2019-11-25 05:02:37

టాలీవుడ్ లో ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న పేరు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి, గీతగోవిందం తదితర చిత్రాల విజయాలతో స్టార్ హీరో హోదా సాధించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు తన పేరునే ఒక బ్రాండ్ నేమ్ గా మార్చేసుకున్నాడు. ఇక ఇప్పుడు అసలు విషయానికొస్తే, విజయ్‌ దేవరకొండ ఓ ఇంటి వాడయ్యారు. అదేంటి ఆయన పెళ్లి చేసుకున్నాడు అనుకుంటున్నారా ?  లేదండోయ్ విజయ్ కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. హైదరాబాద్ ఫిలింనగర్ లో హీరో శ్రీకాంత్ ఇంటికి దగ్గర్లో ఓ విశాలమైన బంగ్లాను విజయ్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేసినట్టు సమాచారం. తన కొత్త నివాసం కోసం విజయ్ భారీ మొత్తం చెల్లించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే నిర్మాతగా మారి ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు విజయ్. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఆ డబ్బుతో విజయ్ సొంతింటి కలను సాకారం చేసుకున్నారని చెబుతున్నారు. 

More Related Stories