ఆ డైరెక్టర్ కి దేవరకొండ హ్యాండ్ ఇచ్చాడాvijay
2019-10-13 18:55:03

డైరెక్టర్ నందిని రెడ్డి చాలా రొటీన్ జానర్ కథలను కూడా అందంగా తెరకేక్కిస్తూ తన ఖాతాలో హిట్స్ వేసుకుంది. రీసెంట్ గా ఆమె తెరకెక్కించిన 'ఓ బేబీ' సినిమా మంచి సక్సెస్ అందుకుంది. దీని తరువాత ఆమె 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ రీమేక్ చేస్తుందని గాసిప్స్ వచ్చాయి. అయితే ఆమె అదేమీ నిజం కాదని తేల్చేసింది. 'మహానటి' సినిమా నిర్మించిన స్వప్న సినిమా బ్యానర్ మీద సినిమా చేస్తున్నట్టు ప్రకటించడమే కాక  ‘అన్ని మంచి శకునములే’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమా నాని చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

అది నాని కాని సినిమా యూనిట్ కానీ ఎవరూ ధ్రువీకరించకపోయినా అదే నిజమని అంటున్నారు. ప్రస్తుతం ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘వి’ సినిమాలో బిజీగా ఉన్న నాని అది పూర్తయిన వెంటనే నందిని షూట్ కి రానున్నాడట. అయితే తాజాగా మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. వాస్తవానికి నందిని - వైజయంతి మూవీస్‌ల కలయికలో విజయ్‌ దేవరకొండ ఓ సినిమా చేయాల్సి ఉంది. ‘గీత గోవిందం’ సినిమా కన్నా ముందే అగ్రిమెంట్ కూడా రాసుకున్నాడట.

 అయితే ఆ తర్వాత వచ్చిన స్టార్ డం వలనో ఇంకేమిటో కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు నానితో నందిని చేస్తోన్న సినిమా రౌడీ కోసం సిద్ధం చేసుకున్న కథతోనే అని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి విజయ్‌.. క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇది పూర్తయిన వెంటనే పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘ఫైటర్‌’ చేసేందుకు రెడీ అవుతున్నాడు

More Related Stories