విజయ్ - పూరీ సినిమా కూడా అదే రేంజ్ లోpuri
2019-12-10 20:23:21

ఐదు బాషలలో రిలీజ్ చేసిన డియర్ కామ్రేడ్ ఫ్లాప్ కావడంతో సైలెంట్ అయిన విజయ్ దేవరకొండ  ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా అనంతరం తన తదుపరి చిత్రాన్ని ఇస్మార్ట్ హిట్ తో ఉన్న పూరి తో చేస్తున్నాడు. ఈ సినిమా కూడా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుందని అంటున్నారు. హిందీ వెర్షన్‌కు కరణ్‌ జోహార్‌ రిలీజ్ చేస్తారని అంటున్నారు. దీనికి సంబందించి త్వరలో అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. మార్షల్‌ ఆర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్న ఈ కథలో విజయ్‌ కొత్త లుక్‌లో కనిపిస్తారట. దీనికి సంబంధించిన శిక్షణ కూడా విజయ్ తీసుకుంటున్నాడట. జనవరిలో ఈ సినిమా షూట్ కు వెళ్లనుందని అంటున్నారు.  ఈ సినిమా 2020 వేసవిలో రిలీజ్ కానుందని సమాచారం. మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్న విజయ్ దేవరకొండ మాస్ ఇమేజ్ కోసమే పూరీ జగన్నాథ్ తో ఫైటర్ మూవీ చేస్తున్నాడని అంటున్నారు. ఇక ఈ పూరీ సినిమా తర్వాత విజయ్ శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడంటున్నారు. అయితే అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.

More Related Stories