సామ్ జామ్ లో రౌడీ హీరో సందడిVijay Devarakonda
2020-11-10 12:10:40

అక్కినేని వారి కోడలు సమంత పెళ్లి ముందు కంటే పెళ్లి తరవాత స్పీడ్ పెంచింది. పెళ్లికి ముందు కేవలం సమంత సినిమాల్లోనే నటించగా పెళ్లి తరవాత అటు సినిమాలు చేస్తూ ఇటు హోస్ట్ గా మరియు టాక్ షోలు చేస్తూ అలరిస్తుంది. ఇటువలే నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కు వెళ్లడంతో సమంత బిగ్ బాస్ కు హోస్ట్ గా వచ్చి సందడి చేసింది. ఇక ఇప్పుడు అల్లు వారి ఓటీటీ ఆహా లో సమంత టాక్ షో చేస్తోంది. ఈ షో కోసం సమంత భారీగా రేమునేషన్ కూడా తీసుకుంటున్నట్టు సమాచారం. షో పేరును "సామ్ జామ్" గా ఇప్పటికే ప్రకటించారు. ఈ టాక్ షో కోసం పలువురు ప్రముఖ సెలబ్రెటీలను ఆహ్వానిస్తున్నారు. అయితే తాజాగా ఈ టాక్ షోకు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. విజయ్ సిల్వర్ కలర్ సూట్ తో మెరిసిపోతున్నారు. ప్రస్తుతం విజయ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక త్వరలోనే మరికొంత మంది సెలబ్రెటీలుకుడా ఈ షోలో హాజరు కానున్నారు. ఈనెల 13 నుండి "సామ్ జామ్" ప్రారంభం కానుంది. ఇక ఓటీటీలో యాంకర్ గా సమంత ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

More Related Stories