వామ్మో విజయ్...ఏంటా లుక్కుVijay Devarakonda New Look.jpg
2019-09-27 08:47:53

టాలీవుడ్‌ క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ ఇప్పుడు ఏ పని చేసినా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నాడు. మొన్నటికి మొన్న సేవ్ నల్లమల అనే ఉద్యమాన్ని సోషల్ మీడియా వేదికగా ఎత్తుకున్న ఈ హీరో తాజాగా మీడియా ముందుకు వచ్చాడు. ఆయన పిక్ ఒకటి నిన్నటి నుండి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదో షాపింగ్ మాల్ లో ఉన్నట్టు ఉన్న ఆ పిక్ లో విజయ్ లుక్ కాస్త ఎబ్బెట్టుగానే ఉంది. ఎందుకంటే నిన్నటి దాకా వేరే ఏదో హెయిర్ స్టైల్ తో ఉన్న ఈయన సడన్ గా ఆ స్టైల్ మార్చడంతో కాస్త వింతగా తయారయ్యాడు. అయితే విజయ్‌ దేవరకొండ న్యూ లుక్‌ వేరే ఏదైనా సినిమా కోసమా లేక ఏదైనా కార్పోరేట్ యాడ్ కోసమా అనేది తెలియాల్సి ఉంది.

మొత్తానికి విజయ్ దేవరకొండ లుక్ అయితే మాత్రం బాగా వైరల్‌ అవుతుంది. ఈ లుక్ మీద మిశ్రమ స్పందన వస్తోంది. చాలా మంది మా రౌడీ భలే ఉన్నాడని అనుకుంటుంటే మరికొంత మంది ఇదేదో తేడాగా ఉందే అంటూ మీమ్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇన్ని రోజులు ఈ చిత్రం కోసం గడ్డంతో కనిపించిన ఈయన ఇప్పుడు ఉన్నట్లుండి ఈ క్లీన్ షేవ్‌ లుక్ లోకి మారిపోయాడు. ఈ సినిమా పూర్తి అయ్యాక పూరీ జగన్నాద్ సినిమా చేయనుండంతో ఆ సినిమాకి ఇదే లుక్ కంటిన్యూ చేస్తారా ? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

More Related Stories