పూరీ దేవరకొండ సినిమా టైటిల్ మీద క్లారిటీ ఇచ్చిన ఛార్మీ vijay devarakonda puri jagannadh
2020-05-20 17:39:11

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఇప్పుడు పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ హిట్ కొట్టి ఉన్న పూరీ జగన్నాద్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో పని చేస్తుండడం తో ఈ సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని ప్యాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. పూరీ జగన్నాధ్ సొంత నిర్మాణ సంస్థతో పాటుగా కరణ్ జోహార్ కూడా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ ఫైటర్ గా నటించనున్నాడు. ఈ సినిమాలో మార్షల్ ఫైట్స్ ఫైటర్ గా నటించనున్న నేపధ్యంలో విజయ్ దాని కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. అయితే ఈ సినిమాకి టైటిల్ గా ఫైటర్ అనే పేరు ఫిక్స్ చేసినట్టుగా చాలా రోజుల ముందు దాకా ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత ఈ సినిమాకి లైగర్ అనే పేరు అనుకుంటున్నటు కూడా ప్రచారం జరిగింది. 

అయితే ఇదంతా ప్రచారమే కానీ ఈ విషయం మీద ఎటువంటి క్లారిటీ లేదు. అయితే తాజాగా ఈ విషయం మీద ఈ సినిమా సహా నిర్మాత ఛార్మీ క్లారిటీ ఇచ్చారు. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఛార్మి. ఈ సినిమాకి ఫైటర్ అఫిషియల్ టైటిల్ కాదని, వర్కింగ్ టైటిల్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. టైటిల్ త్వరలోనే అనౌన్స్ చేస్తామని వెల్లడించింది.  అయితే లైగర్ అనే టైటిల్ ని పూరీ కనెక్ట్ బ్యానర్ మీద రిజిస్టర్ చేసి ఉంచడంతో ఆ టైటిల్ అనే ఫిక్స్ అయిపోయారు. అయితే అసలు లైగర్ అనే పదానికి అర్ధం ఏంటంటే మగ సింహం.. ఆడ పులి సంతానమే లైగర్‌! విచిత్రంగా ఇవి సింహం.. పులి కన్నా చాలా పెద్దగా ఉంటాయి. ఇవి కాస్త సింహంలానే గర్జిస్తాయి. అయితే పూరీ ఈ టైటిల్ అనుకుంటున్నాడంటే పెద్ద ప్లానే వేసి ఉంటాడని అనుకుంటున్నారు.  

More Related Stories