వరల్డ్ ఫేమస్ డే రోజే విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్..vijay
2019-10-21 19:37:34

మనం ఎక్కడ్నుంచి వచ్చామో ఆ మూలాలను అస్సలు మరిచిపోకూడదు. ఇప్పుడు విజయ్ దేవరకొండను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈయన నటిస్తున్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ తర్వాత ఈయన చేస్తున్న సినిమా ఇది. క్రాంతిమాధ‌వ్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ చేతిలో సిగరెట్ పట్టుకుని మొహంలో ఫ్రస్టేషన్ చూపిస్తున్నాడు విజయ్. ఇది సేమ్ టూ సేమ్ మళ్లీ అర్జున్ రెడ్డిని చూస్తున్నట్లే అనిపిస్తుంది. బ్యాక్ టూ పెవిలియన్ అన్నట్లుంది విజయ్ పరిస్థితి. లుక్ చూసి ఫ్యాన్స్ కూడా ఇదే అన్నారు. ఇందులో కొత్తదనం ఏం లేదు.. మళ్లీ అదే చేస్తున్నావా విజయ్ అంటూ ట్రోల్ కూడా చేసారు. ఓనమాలు తర్వాత మళ్లీ మళ్లీ ఇది రానిరోజు లాంటి సినిమా చేసిన క్రాంతి.. ఉంగ‌రాల రాంబాబుతో డిజాస్ట‌ర్ ఇచ్చాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు విజ‌య్ ఉన్న పొజిష‌న్ ప్ల‌స్ క్రేజ్ ను క్రాంతి ఎంత‌వ‌ర‌కు హ్యాండిల్ చేస్తాడు అనేది అంద‌ర్లోనూ ఉన్న అనుమానం. అయితే ఇక్క‌డ మ‌రో అడ్వాంటేజ్ కూడా ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ద‌ర్శ‌కుల‌ను రెస్పెక్ట్ చేయ‌డం బాగా తెలుసు. క‌థ డిమాండ్ చేస్తే కాళ్లు ప‌ట్టుకోడానికి కూడా సిద్ధంగానే ఉంటాడు ఈ హీరో. గీత‌ గోవిందంలో కూడా ఇదే చేస్తాడు విజ‌య్. ఈ సినిమాను ఇదే ఏడాది విడుదల చేయాలనుకున్నా కూడా ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అది కుదిరేలా కనిపించడం లేదు. డిసెంబర్ లో బాలయ్య, రవితేజ, సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోల సినిమాలు ఉండటంతో ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజుకి తన సినిమాను విజయ్ వాయిదా వేసుకున్నాడని తెలుస్తుంది. మొత్తానికి వరల్డ్ ఫేమస్ డే రోజే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా విడుదల కానుందన్నమాట. ఇందులో రాశీ ఖన్నా, కేథరిన్ థ్రెసా, ఎజిబిల్లా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కేయస్ రామారావు సినిమాను నిర్మిస్తున్నారు.

More Related Stories