విజయ్ దేవరకొండ పూరీ మూవీ మొదలయిపోయింది Vijay Deverakonda
2020-01-20 10:49:16

యూత్ లో తెగ ఫాలోయింగ్ సంపాదించిన విజయ్ దేవరకొండ ఈ మధ్య మాస్ హిట్ కొట్టిన పూరీ జగన్నాధ్ లు కలిసి ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఫైటర్ అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా అదుగో మొదలవుతుంది ఇదిగో మొదలవుతుంది అని రకరకాల ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి ఆ ప్రచారాలు అన్నిటికీ బ్రేక్ వేస్తూ ఈరోజు పూజా కార్యక్రమాలతో మొదలయింది ఈ సినిమా. 

కరణ్ జోహార్ కి చెందిన ధర్మా ప్రొడక్షన్స్ సంస్థ సమర్పిస్తున్న ఈ సినిమాని పూరీ కనెక్ట్స్ అలాగే పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్ లు కలిసి నిర్మిస్తున్నాయి. ఇక ఫిబ్రవరి మొదటివారం నుంచి ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కావచ్చని చెబుతున్నారు. ఈమూవీలో విజయ్ ఫైటర్ గా కనిపించనున్నాడు. ఇందుకోసం ఇటివలే మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్న విషయాన్ని చిత్ర సహా నిర్మాత ఛార్మి కూడా ప్రకటించింది. 

ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని అనుకోగా ఆమె రిజెక్ట్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఈరోజు అనౌన్స్ మెంట్ లో కూడా ఈ హీరోయిన్ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విజయ్ సరసన హీరోయిన్ గా అనన్య పాండేను తీసుకున్నట్లు తెలుస్తుంది.

త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమాని జూన్ నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా వచ్చే నెల 14న రిలీజ్ కానుంది.  

More Related Stories