బన్నీ సినిమా కోసం....భారీగా సేతుపతి...Vijay Sethupathi.jpg
2020-02-13 08:00:41

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో  అలవైకుంఠపురములో సినిమా చేసి చాలా గ్యాప్ తర్వాత భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షెడ్యూల్ ఒకటి కేరళ అడవుల్లో పూర్తి కాగా అతి త్వరలో రెండవ షెడ్యూల్ కూడా మొదలు కానుంది. ఈ షెడ్యూల్ లో హీరో అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక మందన్న కూడా పాల్గొనబోతోందని అంటున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగనున్న ఈ సినిమాలో ఆమె కూడా మంచి మాస్ లుక్ లో కనపడనున్నట్లు టాక్. ఇక ఈ సినిమాలో హీరో పాత్రతో పాటు విలన్ పాత్రకు కూడా మంచి వర్త్ ఉండడంతో ఆ పాత్రకు కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతిని ఎంపిక చేసిందట సినిమా యూనిట్. ఇక ఈ సినిమా కోసం ఆయనకు భారీ ఎత్తున రెమ్యునరేషన్ ముట్ట చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి ఈ సినిమాకు గాను మొత్తంగా రూ.కోటిన్నర దాకా రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్లు సమాచారం.

దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

More Related Stories