ఉప్పెన స్పెషల్ సెట్...షూట్ లో జాయిన్ అయిన సేతుపతిvijay
2019-08-21 21:13:11

మెగాస్టార్ చిరంజీవి చిన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ పంజా హీరోగా రూపొందుతోన్న డెబ్యూ మూవీ ఉప్పెన. ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు శానా దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతో కలిసి సుకుమార్‌ రేటింగ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి కీలక పాత్ర పోషించబోతున్నట్లు చిత్ర బృందం గతంలోనే అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో ఆయన విలన్‌గా చేయనున్నాడని ప్రచారం జరిగింది.
అయితే మధ్యలో విజయ్‌ ఈ ప్రాజెక్టు  నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరిగినా అది ఒట్టిదే అని తేలిపోయింది. వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ లో ఈరోజు నుండి విజయ్ సేతుపతి పాల్గొంటున్నారు. సారథి స్టూడియోలో రంగస్థలం ఫేమ్ ఆర్ట్ డైరెక్టర్స్ మోనిక, రామకృష్ణ వేసిన భారీ సెట్‌లో ప్రస్తుతం సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో వైష్ణవ్ తేజ్, రాజీవ్ కనకాల, హీరోయిన్ కృతి, అలాగే 500 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా పాల్గొంటున్నారట. ఇప్పటి వరకు 40 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు మేకర్స్. 

More Related Stories