సమంతా vs నయనతార...క్రేజీ కాంబో  Vijay Sethupathi
2020-02-15 21:44:44

నయనతార, సమంత... ఇద్దరూ సౌత్ ఇండియాలో స్టార్ హోదా అనుభవిస్తున్నారు. అయితే  వీరిద్దరు కలిసి ఒక్క సినిమా కూడా కలిసి చేయలేదు. కానీ ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. విజయ్‌ సేతుపతి హీరోగా నయన్ ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కదవుక్కుళ్ల రెండు కాదల్‌’ ఈ సినిమాలో వీరిద్దరిని హీరోయిన్స్ గా కన్ఫాం చేశారు. ఆ టైటిల్ కి తెలుగులో ‘తలుపు వెనుక రెండు ప్రేమకథలు’ అని అర్థం. 

నిన్న వాలెంటైన్స్ డే కానుకగా శుక్రవారం ఈ చిత్రాన్ని ప్రకటించారు. ‘తొలిసారి వెండితెరపై కనీవిని ఎరుగని ఘర్షణ. నయనతార వర్సెస్‌ సమంత’ అని! వర్సెస్‌ (విఎస్‌) అంటే విజయ్‌ సేతుపతి అనీ ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాకి అనిరుధ్‌ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. నేనూ రౌడీనే తర్వాత విజయ్‌ సేతుపతి, విఘ్నేశ్‌ శివన్‌, నయనతార, అనిరుధ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న రెండో సినిమా ఇది. ఈసారి వీళ్లకు సమంత కూడా జత కలిసింది.

More Related Stories