ఎన్టీఆర్ కు విలన్ గా తమిళ హీరోVijay Sethupathi
2021-06-15 14:41:53

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో 31 వ సినిమాగా ఈ చిత్రం రాబోతోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.  పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం తమిళ స్టార్ విజయ్ సేతుపతి ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ సేతుపతి మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో ఉప్పెన సినిమాలో నటించారు.  ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మైత్రి వారు విజయ్ సేతుపతితో మరో సినిమా చేసేందుకు ఒప్పందం చేసుకున్నారట. అంతేకాకుండా అడ్వాన్స్ కూడా ఇచ్చేశారట. 

అయితే ఇప్పుడు విజయ్ సేతుపతిని ఎన్టీఆర్ సినిమా కోసం వాడు కోవాలని మైత్రీ వాళ్ళు చూస్తున్నారట. దాంతో ఎన్టీఆర్ సినిమాలో సేతుపతి విలన్ గా దాదాపు ఖరారైనట్లే అనిపిస్తుంది. ఇక ఇప్పటికే విజయ్ సేతుపతి ఉప్పెన, మాస్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు భాగా దగ్గరయ్యారు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కూడా కన్ఫామ్ అయితే సేతుపతి తెలుగు వారికి మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రశాంత్ నీల్ సినిమా కాబట్టి విలన్ గా మరో మెట్టు ఎక్కే అవకాశం ఉంది.

More Related Stories