విజయ్ సేతుపతి ఫిక్సయ్యాడు.. తెలుగులో కూడా బ్యాటింగ్..



Vijay Sethupathi
2021-01-17 13:33:55

తమిళనాట స్టార్ హీరోగా చక్రం తిప్పుతూ కూడా ఇప్పుడు తెలుగులోనూ ఇమేజ్ కోసం పాకులాడుతున్నాడు విజయ్ సేతుపతి. కేవలం హీరోగానే నటిస్తాను అనే మాట లేకుండా వరసగా అన్ని రకాల పాత్రలు చేస్తున్నాడు ఈయన. కథ నచ్చాలే కానీ చిన్నా పెద్దా చూసుకోకుండా విలన్ అయిపోతున్నాడు కూడా. ఇప్పటికే రజినీకాంత్ పేట, విజయ్ మాస్టర్ సినిమాలో పూర్తిస్థాయి విలన్ పాత్రలో నటించాడు విజయ్ సేతుపతి. ఇక ఇప్పుడు ఈయన ఫోకస్ అంతా తెలుగు సినిమాపైనే ఉంది. సైరాలో ఇప్పటికే చిన్న పాత్రతో ఇక్కడి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు విజయ్. మెగా చిన్న మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా వస్తున్న ఉప్పెన సినిమాలో కూడా ఈయన నటిస్తున్నాడు.

విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ లాంటి నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. బుచ్చిబాబు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ సినిమా ఫిబ్రవరిలో సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో విలన్ గా తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. వరుసగా విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. తెలుగు ఇండస్ట్రీపై ఇప్పుడు దృష్టి పెట్టాడు. క్యారెక్టర్ నచ్చితే హీరో ఎవరో అని కూడా చూడడు. తన పాత్రకు మంచి పేరు వస్తుంది అంటే చిన్న సినిమాలలో కూడా నటిస్తాడు విజయ్ సేతుపతి. ఇప్పుడు కూడా వైష్ణవ్ తేజ్ సినిమాలో క్యారెక్టర్ అద్భుతంగా ఉండటంతో విజయ్ ఒప్పుకున్నాడు.

ఇప్పటికే మాస్టర్ సినిమాలో భయంకరమైన విలన్ గా నటించాడు విజయ్ సేతుపతి. దాంతో పాటు ఈ మధ్య మరో రెండు తెలుగు సినిమాలు కూడా ఒప్పుకున్నాడు విజయ్ సేతుపతి. ఏదేమైనా కూడా కేవలం హీరోగా మాత్రమే కాకుండా కథ నచ్చితే ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి సై అంటున్నాడు విజయ్. హిందీలో అమీర్ ఖాన్ హీరోగా వస్తున్న లాల్ సింగ్ చడ్డా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు సేతుపతి. మొత్తానికి తమిళంతో పాటు మిగిలిన ఇండస్ట్రీలపై కూడా పూర్తిస్థాయిలో విరుచుకుపడుతున్నాడు ఈయన. 

More Related Stories