ఆ పార్టీని తప్పుపడుతున్న విజయ్ అభిమానులు..vijay
2020-03-13 14:56:41

ప్రస్తుతం తమిళనాట రజినీకాంత్ కంటే ఎక్కువ ఇమేజ్ ఎంజాయ్ చేస్తున్నాడు దళపతి విజయ్. ఒకప్పుడు రజనీకాంత్ తర్వాత అనే వాళ్ళు. కానీ ఇప్పుడు విజయ్ సూపర్ స్టార్ ను కూడా దాటి పోయాడు. వరుస విజయాలతో తన మార్కెట్  రోజురోజుకు ఇంకా పెంచుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో నెల రోజుల వ్యవధిలోనే ఆయన ఇంటిపై రెండోసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. గతంలో దాడులకు కొనసాగింపుగానే ప్రస్తుతం దాడులు జరుపుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే తమిళనాట మిగిలిన పెద్ద హీరోలను వదిలేసి కేవలం విజయ్  ఇంటిపైనే ఇలా ఐటీ శాఖ దాడులకు దిగడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరీ ప్రత్యేకంగా బీజేపీ ప్రభుత్వం విజయ్ పై కావాలనే కక్ష కట్టింది అంటూ అభిమానులు మండిపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు విజయ్ కు తన సినిమాలు తప్ప మరో ప్రపంచం లేదన్నట్లు బతికాడు. కానీ ఆయనను కావాలనే కొందరు రెచ్చగొడుతున్నట్లు అనిపిస్తుంది తమిళనాట పరిస్థితులు చూస్తుంటే.


హాయిగా తన సినిమాలు తను చేసుకుంటూ ఉంటే కూడా కొన్ని రాజకీయ పార్టీలు విజయం వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాయని అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. దాంతో తమ హీరో కూడా రాజకీయాలు అరంగేట్రం చేస్తాడని ఎదురు చూస్తున్నారు. చూస్తుంటే వాళ్ళ ఆశ త్వరలో నెరవేరుతుందా అన్నట్లు కనిపిస్తోంది తమిళనాట ఇప్పుడు సిచువేషన్. నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లు విజయ్ కూడా రాజకీయాలకు వస్తాడా రాడా అనేది చెప్పకుండా తిరుగుతున్నాడు. కానీ రాజకీయ నాయకులను మాత్రం టార్గెట్ చేస్తూనే ఉన్నాడు విజయ్. వీలున్నప్పుడు తన ప్రతి సినిమాలో ప్రస్తుత రాజకీయాలపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నాడు. దాంతోపాటు నిజజీవితంలో కూడా రాజకీయాల బాట పడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. అన్నింటికీ మించి ఇప్పుడు మరోసారి ఆయన ఇంటిపై ఐటీ దాడులు జరిగిన తర్వాత విజయ్ తీరులో కూడా మార్పు వచ్చింది.


నేను ఒక ద్రవిడని.. ఎక్కడో ఉత్తరాది నుంచి వచ్చిన ఒక పార్టీకి గానీ అక్కడి నాయకులకు గాని నేను తల వంచి నిలబడను.. వాళ్ల ముందు నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకోలేను అంటూ ఐటీ దాడులపై విజయ్ ఇచ్చిన క్లారిటీ విన్న తర్వాత ఆయన కూడా రాజకీయాల్లోకి వస్తాడని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు అభిమానులు. ప్రస్తుతం తమిళనాట ఇదే టాపిక్ ఎక్కువగా నడుస్తుంది. దళపతి విజయ్ కచ్చితంగా పొలిటికల్ పార్టీ మొదలు పెడతాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలు తప్ప మరో ప్రపంచం లేదు అంటున్నారు విజయ్ సన్నిహితులు. కానీ విజయ్ మాత్రం సినిమాలు చేస్తూనే రాజకీయాలపై కూడా కన్నేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. తను ఎవరెవరు టార్గెట్ చేస్తున్నారు కూడా ఈ హీరో గుర్తు పెట్టుకుంటున్నాడు. సమయం వచ్చినప్పుడు అందరి లెక్కలూ తేలుస్తాం అంటున్నాడు ఈయన. ముఖ్యంగా కమలనాథులతో విజయ్ కి అస్సలు పడటం లేదు. అందుకే బిజెపిపై ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు సెటైర్లు వేస్తున్నాడు విజయ్. ఏదేమైనా కూడా తమిళనాట రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మాస్టర్ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. సమ్మర్ కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Related Stories