చిరు బాట‌లోనే విజ‌య‌శాంతి కూడా..2017-04-01 13:49:56

చిరంజీవి-విజ‌య‌శాంతి.. ఒక‌ప్పుడు సూప‌ర్ హిట్ కాంబినేష‌న్ ఇది. దాదాపు 20 సినిమాల్లో క‌లిసి న‌టించారు ఈ జంట‌. వాటిలో మేజ‌ర్ పార్ట్ అన్నీ బ్లాక్ బ‌స్ట‌ర్లే. రాధ‌, రాధిక త‌ర్వాత చిరుతో ఆ స్థాయిలో సెట్టైన జోడీ విజ‌య‌శాంతే. మెకానిల్ అల్లుడు త‌ర్వాత మ‌ళ్లీ ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టించ‌లేదు. ఇక ఇప్పుడు చిరు బాట‌లో విజ‌య‌శాంతి ఎక్క‌డ న‌డుస్తుంద‌ని అనుకుంటున్నారా..? అక్క‌డికే వ‌స్తున్నాం.. ఇండ‌స్ట్రీలో ఇప్పుడు రీ ఎంట్రీల ప‌ర్వం న‌డుస్తుంది. ఈ మ‌ధ్యే చిరంజీవి రీ ఎంట్రీలో ఎంతటి సంచ‌ల‌నం సృష్టించాడో తెలిసిందే.

ఇప్పుడు రాముల‌మ్మ కూడా రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. అన్నీ కుదిర్తే మే నుంచే రాముల‌మ్మ యాక్ష‌న్ లోకి దిగిపోనుంద‌ని తెలుస్తోంది. త‌న‌కు అచ్చొచ్చిన ఆర్మీ ఆఫీస‌ర్ పాత్ర‌తోనే మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇవ్వ‌నుంది విజ‌య‌శాంతి. దీనికోసం ఇప్ప‌ట్నుంచే ఎక్స‌ర్ సైజులు గట్రా చేసి ఒళ్లు త‌గ్గిస్తుంది విజ‌యశాంతి. మొత్తానికి రీ ఎంట్రీలో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించాడు.. మ‌రి విజ‌య‌శాంతి లేడీ అమితాబ్ ఈజ్ బ్యాక్ అనిపిస్తుందా..?

More Related Stories