విజయశాంతి బీజేపీలో చేరేందుకు లైన్‌ క్లియర్‌ Vijayashanthi
2020-10-28 17:55:03

సినీనటి , రాజకీయ నాయకురాలు విజయశాంతి బీజేపీలో చేరేందుకు సిద్ధమౌతున్నారు. నవంబర్ 10 లోపు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అమిత్ షా, నడ్డా ల సమక్షంలో రాములమ్మ బీజేపీలో చేరుతునట్టు సమాచారం. ఇదిలా ఉండగా విజయ శాంతి అప్పట్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మదిలో నీలిచిపోయింది. "సమ్మక్క సరక్క, ఒసేయ్ రావులమ్మ" లాంటి సినిమాలతో విజయ్ శాంతి మరింత క్రేజ్ సంపాదించింది. ఇక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ శాంతి సినిమాలకు దూరం అయింది. మొదట రాములమ్మ సొంతంగా తెలంగాణ కోసం పోరాటం చేస్తూ తల్లి తెలంగాణ అనే పార్టీని సైతం స్థాపించింది. ఆ తరవాత ఆమె టిఆర్ఎస్ పార్టీలో చేరింది. అయితే టిఆర్ఎస్ లో ఆమెకు టికెట్ దక్కకపోవడంతో టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరి అధికార పార్టీ చేస్తున్న అక్రమాలపై తన గళం విప్పింది.  ఇక తాజాగా ఆమె కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపి లోకి చేరేందుకు సిద్ధమౌతోంది. రాములమ్మ రాజకీయ భవిష్యత్ బీజేపీ లోకి చేరిన తరువాత ఎలా ఉంటుందో చూడాలి.

More Related Stories