బెల్లంకొండ సినిమాకు రైటర్ గా విజయేంద్రప్రసాద్



Vijayendra Prasad
2020-11-24 16:00:25

అల్లుడు శ్రీను సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల వచ్చిన రాక్షసుడు సినిమాతో భారీ హిట్ కొట్టాడు. ఇక గత కొన్ని రోజులుగా  శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీపై వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో రాజమౌళి దర్శకత్వం వహించిన "ఛత్రపతి "సినిమా ను హిందీలో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో ప్రభాస్ హీరోగా నటించగా బాలీవుడ్ రీమేక్ లో శ్రీనివాస్  నటిస్తున్నారు. అయితే రీమేక్ లో కొన్ని మార్పులు చేయాలని చిత్ర బృందం ఆలోచిస్తోందట. 

అంతే కాకుండా ఛత్రపతి సినిమాకు కథను అందించిన విజయేంద్రప్రసాద్ కే కథలో కొన్ని మార్పులు చేసే భాధ్యతను అప్పగించిందట. ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్ లో కథలో మార్పులు చేస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సాయి శ్రీనివాస్ "అల్లుడు అదుర్స్"అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కందిరీగ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలను అందిస్తున్నారు. శ్రీనివాస్ కు జంటగా నబ నటేష్, అను ఇమాన్యుఎల్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే శ్రీనివాస్ 8ఫ్యాక్స్ బాడీ పెంచాడు. సినిమాను సంక్రాంతి బరిలో దించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

More Related Stories