రాజమౌళి తండ్రికి కరోనా



Vijayendra Prasad
2021-04-07 14:19:15

సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా చాలా మంది సినీ ప్రముఖులు ఇప్పటికే కరోనా బారిన పడ్డారు.  లేటెస్ట్ గా  రాజ‌మౌళి తండ్రి ప్రముఖ సినీ రచయిత  విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌రోనా బారీన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ఫేస్‌బుక్  ద్వారా వెల్ల‌డించారు. 

త‌న‌కు క‌రోనా సోకింద‌ని, త‌న‌ని ఇటీవ‌ల క‌ల‌సిన వాళ్లంతా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరారు.  రెండు వారాల పాటు నా సన్నిహితులు మరియు వృత్తి పరమైన భాగస్వాములు ఎవరు కూడా నాతో ఫోన్ లో మాట్లాడేందుకు ప్రయత్నించవద్దని సూచించాడు. విజ‌యేంద్ర ప్ర‌సాద్‌కు కోవిడ్ సోక‌డం పట్ల రాజ‌మౌళి అభిమానులు కొంత క‌ల‌వ‌రానికి గుర‌వుతున్నారు. ఇదిలా వుంటే ఆయ‌న‌కు ఎలాంటి స‌మ‌స్యా లేద‌ని,  వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోఉన్నార‌ని తెలిసింది.

More Related Stories