విజయ్ మాస్టర్ టీజర్ టాక్Vijays Master
2020-11-15 02:44:09

తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాపై తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ త్రీ సినిమాకు రీమేక్ గా వచ్చిన స్నేహితుడు సినిమాతో విజయ్ తెలుగు వాళ్లకు కూడా దగ్గరయ్యాడు. ఆ తరవాత తుపాకీ వచ్చినా పెద్దగా ఆడలేదు. కానీ ఆ తరవాత వచ్చిన విజిల్, అదిరింది, సర్కార్ సినిమాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. దాంతో విజయ్ సినిమాలకు తెలుగులోనూ 10కోట్లు కాయం అనే నమ్మకం వచ్చేసింది. దాంతో తెలుగులోనూ వరుసపెట్టి తన సినిమాలను విడుదల చేస్తున్నాడు. 

ఇక ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన సినిమా "మాస్టర్" టీజర్ ను దీపావళి సందర్భంగా  విడుదల చేసారు. ఈ సినిమా స్టైలిష్ కాలేజి పొలిటికల్ డ్రామాగా తెరకెక్కినట్టు తెలుస్తోంది. సినిమాలో లోకల్ గుండా పాత్రలో విజయ్ సేతుపతి నటించాడు. సేతుపతి...దళపతి మధ్య ఉన్న సన్నివేశాలు టీజర్ లో హైలెట్ గా నిలిచాయి. హీరో విజయ్ కి సరైన విలన్ గా సేతుపతి కనిపిస్తున్నాడు. సినిమాలో విజయ్ స్టూడెంట్ గా కాకుండా ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ రిలీజ్ తో విజయ్ గత సినిమా రికార్డులు బద్ధలుకావడం కాయమనిపిస్తుంది. ఈ సినిమాలో విజయ్ మాస్ యాక్షన్ హీరోగా మరోసారి తన అభిమానులను మెప్పించడం కాయమనిపిస్తుంది. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

More Related Stories