బాలయ్యకు గ్రామస్థుల షాక్



balakrishna
2021-02-22 10:10:23

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం "గాడ్ ఫాదర్".ఈ సినిమాను దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్నారు. సినిమాలో బాలయ్య సరసన అఖిల్ సినిమాతో టాలీవుడ్ ను పలకరించిన స్లిమ్ బ్యూటీ సయేశా సైగల్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ కొంతవరకు పూర్తయ్యింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం వికారాబాద్ వెళ్లగా యూనిట్ కు చేదు అనుభవం ఎదురైనట్టు తెలుస్తోంది. వికారాబాద్ మండల పరిధిలోని కోటాలగూడ గ్రామ సమీపంలో ఆదివారం బాలయ్య సినిమా షూటింగ్ ను స్థానికులు అడ్డుకున్నారు. 

షూటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తుండగా వచ్చిన గ్రామస్థులు షూటింగ్ జరిపేందుకు నిరాకరించారు. తమ భూములు కబ్జా అవుతున్నాయని షూటింగ్ కు పర్మిషన్ తో పాటు గ్రామాభివృద్ధికి ఏదైనా సహాయం చేస్తేనే అనుమతిస్తామని అన్నారు. అయితే అక్కడ ఒక సన్నివేశానికి అనుమతి తీసుకున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించైనా గ్రామస్థులు వినలేదు. దాంతో చేసేది లేఖ యూనిట్ సభ్యులు అక్కడ నుండి వెనక్కు వెళ్లి పోయారు. ఇక ఈ విషయం పై గ్రామ సిఐ మాట్లాడుతూ సినిమా షూటింగ్ కు ఎలాంటి అనుమతి తీసుకోలేదని అన్నారు.

More Related Stories