నాగ చైతన్య అనుష్కతో విక్రమ్ కే కుమార్..Naga Chaitanya Anushka
2020-03-04 18:40:28

తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. దక్షిణాదిన ఉన్న సాఫ్ట్ డైరెక్టర్స్ లో విక్రమ్ కే కుమార్ కూడా ఒకడు. ఈయన సినిమాలు ఫ్లాప్ అవుతాయేమో కానీ ప్రశంసలు మాత్రం దక్కించుకుంటాయి. కానీ ఫస్ట్ టైమ్ ఆయన కెరీర్ లో గ్యాంగ్ లీడర్ సినిమా ఫ్లాప్ తో పాటు విమర్శలు కూడా తీసుకొచ్చింది. ఇష్క్, మనం, 24, హలో లాంటి సినిమాలు చేసిన ఈయన గతేడాది గ్యాంగ్ లీడర్ అంటూ వచ్చాడు. టైటిల్ లోనే పవర్ ఉంది కానీ కథలో మాత్రం లేదంటూ పెదవి విరుస్తున్నారు ప్రేక్షకులు. మరీ ముఖ్యంగా విక్రమ్ కే కుమార్ సినిమాలను అభిమానించే వాళ్లకు మాత్రం గ్యాంగ్ లీడర్ తీవ్రంగా నిరాశ పరిచిందనే చెప్పాలి. 

ఎందుకంటే రొటీన్ కథలు తీసుకున్నా కూడా దానికి తన మార్క్ స్క్రీన్ ప్లే అద్ది ఔట్ స్టాండింగ్ అనిపిస్తాడు విక్రమ్. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ లో కూడా ఇదే చేస్తాడని అనుకున్నారు ఆడియన్స్. కానీ దీనికి పరమ రొటీన్ స్క్రీన్ ప్లే రాసుకుంటాడని మాత్రం ఎవరూ కనీసం ఊహించలేదు. లెక్కలేసుకుని తీసినట్లు.. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు అంతా మన కళ్ల ముందు కనిపిస్తున్న క్షణాన విక్రమ్ కే కుమార్ స్క్రీన్ ప్లే మాత్రం పూర్తిగా తేలిపోయింది. దాంతో ఆడియన్స్ లో నిరాశ కూడా తప్పలేదు. ముఖ్యంగా విక్రమ్ లాంటి బ్రిలియంట్ దర్శకుడి నుంచి గ్యాంగ్ లీడర్ లాంటి రొటీన్ స్క్రీన్ ప్లే మాత్రం అస్సలు ఊహించలేదు. 

ఈ సినిమా తర్వాత విక్రమ్ కే కుమార్ తో పని చేయడానికి స్టార్ హీరోలే కాదు నార్మల్ హీరోలు కూడా ముందుకు రావడం లేదు. దాంతో ఇప్పుడు ఈయన వెబ్ సిరీస్ వైపు అడుగులేస్తున్నాడని తెలుస్తుంది. అది కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నాగ చైతన్య, అనుష్క లాంటి స్టార్స్ కూడా నటించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో మరోసారి తన సత్తా చూపించాలని చూస్తున్నాడు విక్రమ్ కే కుమార్. 

More Related Stories