విశాల్ ఎనిమి ఫస్ట్ లుక్..పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్Vishal ENEMY
2020-12-17 22:49:17

తమిళ హీరోలు ఆర్య, విశాల్ కలిసి నటిస్తున్న సినిమా "ఎనిమి". ఈ సినిమాను విజయ్ దేవరకొండ తో "నోటా" ను తెరకెక్కించిన దర్శకుడు ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో విశాల్ హీరోగా నటిస్తుండగా..ఆర్య విలన్ గా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. సినిమాలో "గద్దల కొండ గణేష్" సినిమాలో హీరోయిన్ గా నటించిన మృణాళిని హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాలో విశాల్  లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసారు. పోస్టర్ లో విశాల్ గన్ పట్టుకుని కిందకి చూస్తూ కనిపిస్తున్నారు. 

విశాల్ అభిమానులను ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. లాక్ డౌన్ తరవాత సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించారు. ఇక వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా తరువాత విశాల్ "డిటెక్టివ్2" సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. మరోవైపు విశాల్ నటించిన "చిత్ర" సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉంది. ఇదిలా ఉండగా విశాల్, ఆర్య ఇదివరకే ఓ సినిమాలో కలిసి నటించారు. బాల డైరెక్షన్ లో ఈ ఇద్దరు హీరోలు "వాడు వీడు" సినిమాలో నటించి మెప్పించారు. ఇక ఈసారి ఏమేరకు అలరిస్తారో చూడాలి.

More Related Stories