మంచు విష్ణు కాల్ సెంటర్ లో సునీల్ శెట్టి... Vishnu Manchu
2019-09-30 09:53:44

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, డీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన మంచు విష్ణు హాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో ఒక సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి హాలీవుడ్ లో అనేక సినిమాలు తెరకెక్కించిన జఫ్పెరీ చిన్ దర్శకుడు. ఈ సినిమా తెలుగు, ఆంగ్ల బాషలలో తెరకెక్కుతోంది. అయితే ఈ మధ్య అన్ని సినిమాలను భారతీయ బాషలలో రిలీజ్ చేస్తున్న క్రమంలో మిగతా బాషలలో స్టార్స్ అనిపించుకుంటున్న వారు ఎవరో ఒకరు తమ తమ ప్రాజెక్ట్ లలో భాగస్వామ్యం అయ్యేలా చూసుకుంటున్నారు. 

ఇక ఈ సినిమాలో కూడా అదే క్రమంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటించనున్నట్లు టాక్. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం సునీల్‌శెట్టి అయితే సరిగ్గా సరిపోతాడని భావించిన యూనిట్ ఆయన్ని సంప్రదించి నట్టు సమాచారం. పాత్ర నచ్చడంతో ఆయన కూడా సినిమా ఒప్పుకున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాకు ‘కాల్‌ సెంటర్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారని ఇన్ సైడ్ వర్గాల సమాచారం. నిజానికి ఈ సినిమాని విష్ణు రెండేళ్ళ క్రితం ప్రకటించాడు. అయితే అది మొన్న పట్టాలేక్కింది. 

కాజల్ తో పాటు ఈ సినిమాలో చిలసౌ హీరోయిన్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. అక్టోబర్ 2016లో ముంబైలోని మీరా రోడ్ లోని తొమ్మిది కాల్ సెంటర్ ల మీద పోలేసులు రైడ్ చేయగా ఆ కాల్ సెంటర్స్ నుండి అమెరికా పౌరుల నుండి కోట్లు కొల్లగొడుతూన్నట్టు తేలింది, ఈ సినిమా అదే కధాంశం మీద ఉండనుందని అంటున్నారు. సునీల్‌ శెట్టి ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్‌ పాత్రలో కనిపిస్తారట. త్వరలోనే ఆయన షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు చెబుతున్నారు

More Related Stories