"పాగల్" అవుతున్న విశ్వక్ సేన్...Vishwak Sen
2019-08-16 08:57:31

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా నటుడిగా పరిచయమైన విశ్వక్‌ సేన్ అందులో నాగుల పంచమి డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు. ఆయన తాజాగా సోలో హీరోగా చేసిన ఫలక్‌నుమా దాస్ సినిమా సూపర్ డూపర్ హిట్ కాకున్నా ఫర్వాలేదనిపించుకుంది. ఆ సినిమాతో వచ్చిన పాపులారిటీ కంటే ఆ సమయంలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో పెట్టుకున్న గొడవలు ఇంకా ఎక్కువ పాపులారిటీ తెచ్చి పెట్టాయి, సోషల్ మీడియాలో ఏదో బూతులు మాట్లాడాడని కూడా అప్పట్లో రచ్చ రేగింది. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ జోక్యంతో ఆ వ్యవహారం కాస్త సద్దుమణిగింది అనుకోండి అది వేరే విషయం. తాజాగా ఇప్పుడు ఈ హీరో ‘పాగల్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట. 

హుషారు సినిమాతో హిట్ అందుకున్న నిర్మాత బెక్కెం వేణు గోపాల్ నిర్మాతగా ఈ సినిమా ఉండబోతోందని అంటున్నారు. నరేష్‌రెడ్డి కుప్పిలి అనే ఆయన చెప్పిన కధ నిర్మాతకి బాగా నచ్చిందట, ఈ కథకు విశ్వక్‌సేన్‌ అయితే తప్పకుండా న్యాయం చేస్తాడనే ఉద్దేశ్యంతో ఆయన్ను ఈ సినిమాలో హీరోగా తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాతో నరేష్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లవ్‌స్టొరీగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ రెండవ వారంలో మొదలు పెట్టి వచ్చే ఏడాదిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నామ‌ని చిత్ర బృందం పేర్కొంది.


 

More Related Stories