ప్రమాదంలో చిక్కుకున్న టాలీవుడ్ యంగ్ హీరో



Vishwak Sen
2020-11-26 11:41:06

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రమాదంలో చిక్కుకున్నారు. పాగల్ సినిమా షూటింగ్ కోసం వెళ్లిన విశ్వక్ అక్కడే చిక్కుకున్నారు. తమిళనాడు నివర్ తుఫాన్ వణికిస్తోంది. ఏపీలో కి కూడా ఈ తుఫాన్ ఎంటర్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ఇక నిఫర్ తుఫాన్ పాండిచ్చేరి ని తాకడం తో విశ్వక్ అక్కడే ఉండిపోయారట. తుఫాన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ రావడంతో చిత్ర యూనిట్ ఎంజాయ్ చేస్తుంది. పాండిచ్చేరి వీధుల్లో విశ్వక్ సందడి చేస్తున్నాడు.

 అక్కడ ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను విశ్వక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే ఈ నగరానికి ఏమైంది సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సాధించాడు. ఆ తరవాత డైరెక్టర్ కమ్ హీరోగా "ఫలక్ నామా దాస్" సినిమాతో మంచి విజయం సాధించాడు. ఇక లాక్ డౌన్ కి ముందు విడుదలైన "హిట్" సినిమాతోను మరో హిట్ కొట్టి తన సత్తా చాటాడు. దాంతో ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్ లతో విశ్వక్ బిజిగా ఉన్నాడు. ప్రస్తుతం విశ్వక్ నటిస్తున్న పాగల్ సినిమాను బెక్కెం వేణు గోపాల్ నిర్మిస్తున్నారు. సినిమాకు నరేష్  కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
 

More Related Stories