ఆ హీరోకి మహేష్ ని డైరెక్ట్ చేయాలనుందట  Vishwak Sen
2020-04-03 18:48:20

వెళ్ళి పోమాకే అనే సినిమాతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన విశ్వక్ ఈ నగరానికి ఏమైంది సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు, ఆ సినిమా తరువాత ఏకంగా ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాతో తానే నటుడిగా దర్శకుడిగా పక్కా హైదరాబాదీ నేటివిటీతో సినిమాను తీసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక మొన్నీమధ్య నాని నిర్మాతగా రూపొందించిన ‘హిట్’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఈయన తన నెక్ట్స్ మూవీని కూడా ఇటీవల ప్రారంభించాడు. పాగల్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు విశ్వక్ సేన్ రెడీ అవుతున్నాడు.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ తన కోరికను బయట పెట్టాడు. తాను చిన్నతనం నుంచి మహేష్ బాబు సినిమాలు చూస్తూ మహేష్ అభిమాని గా పెరిగానన్న ఆయన మహేష్ ను డైరెక్ట్ చేయాలనుందని ఓపెన్ అయ్యాడు. చిన్నప్పటి నుండి మహేష్ కి చాలా పెద్ద అభిమానినన్న ఆయన్ ఇప్పుడు ఎన్టీఆర్ అంటే కూడా చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు.  తనకు డైరెక్టర్ గా పని చేయడం ఇష్టం అని, అయితే ప్రస్తుతానికి మాత్రం సినిమాలో నటించడం మీదనే తన ద్రుష్టి ఉందని త్వరలోనే తనలో పూర్తి స్థాయి దర్శకుడిని చూస్తారని ఆయన చెబుతున్నాడు.

More Related Stories