విష్వక్ సేన్ ఓ మై కడవులే రీమేక్ కు క్లాప్ కొట్టిన దిల్ రాజుVishwak Sen
2020-12-28 15:36:26

ఈ నగరానికి ఏమైంది సినిమాతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న హీరో విష్వక్ సేన్. ఆ తరవాత వరుస సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం "పాగల్" సినిమా షూటింగ్ దశలో ఉండగానే విష్వక్ మరో సినిమాకు ఒకే చెప్పాడు.  పీవీపీ సినిమా, దిల్ రాజు బ్యానర్ వెంకటేశ్వర క్రియేషన్స్ పాతాకాలపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన రొమాంటిక్ ఫాంటసీ ఫిల్మ్  "ఓ మై కడవులే"కు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళంలో దర్శకుడు గా వ్యవహరించిన అశ్వత్ మారి ముత్తునే తెలుగులోనూ డైరెక్ట్ చేస్తున్నారు.

ఇక సినిమా ముహూర్త సన్నివేశానికి దిల్ రాజు క్లాప్ కొట్టాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పెళ్లి చూపులు సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ ముహూర్త సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. దిల్ రాజు దర్శకుడు అశ్వత్ కు స్క్రిప్ట్ ను అందించారు. అంతే కాకుండా ఈ సినిమాకు దర్శకుడు తరుణ్ భాస్కర్ మాటల రచయితగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభం కానుంది. త్వరలోనే హీరోయిన్ మరియు ఇతర నటీనటుల వివరాలను చిత్ర యూనిట్ ప్రకటించనుంది.

More Related Stories