విశ్వక్ సేన్ పాగల్ ఫస్ట్‌లుక్ విడుదల



Vishwak Sen
2021-02-02 14:16:28

విశ్వక్ సేన్ నూత‌న ద‌ర్శ‌కుడు న‌రేష్ కొప్పల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా పాగల్ . తాజాగా పాగ‌ల్ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఇందులో విశ్వ‌క్ సేన్ సరికొత్త లుక్‌లో క‌నిపిస్తూ అభిమానుల‌కి ఆనందాన్ని అందిస్తున్నాడు. ఏప్రిల్ 30న చిత్రాన్ని థియేట‌ర్‌లోకి తీసుకు రానున్న‌ట్టు మేక‌ర్స్ ఫ‌స్ట్ లుక్ ద్వారా తెలియ‌జేశారు. మ్యాజిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు స‌మ‌ర్పణ‌లో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఫలక్ నామా దాస్, హిట్ సినిమాలు సక్సెస్ అవడంతో విశ్వక్ సేన్ మార్కెట్ బాగా పెరిగింది. ముఖ్యంగా యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. పాగ‌ల్ సినిమాపై కూడా అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి.

More Related Stories