బండ్ల గణేష్ Vs హరీష్ శంకర్.. ఏం జరుగుతుంది.. Harish Shankar
2020-05-14 17:01:53

టాలీవుడ్ లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం రేపుతూనే ఉంటాడు నిర్మాత బండ్ల గణేష్. ఇప్పుడు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ పై ఈయన అంతకంటే సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఇద్దరు కలిసి సరిగ్గా ఎన్నేళ్ల కింద గబ్బర్ సింగ్ అని బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన సంగతి తెలిసిందే. తన కెరీర్ లో అంత మంచి సినిమా ఇచ్చిన దర్శకుడిపై ఇప్పుడు కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు బండ్ల గణేష్. అయితే ఈ వివాదానికి బీజం వేసింది మాత్రం దర్శకుడు హరీష్ శంకర్. ఈ మధ్యే గబ్బర్ సింగ్ 8 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాకు సహకారం అందించిన అందరికీ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు హరీష్ శంకర్. అందులో నిర్మాత బండ్ల గణేష్ పేరు చేర్చలేదు. దాంతో అక్కడి అసలు కాంట్రవర్సీ మొదలైంది. 

నిర్మాతకు థాంక్స్ చెప్పకుండా మిగిలిన వాళ్లందరికీ చెప్పడం ఏంటి అంటూ హరీష్ శంకర్ ను సోషల్ మీడియాలో కొందరు అడిగారు. ఇదే క్వశ్చన్ ఇప్పుడు బండ్ల గణేష్ ని కూడా అడిగారు. దానికి ఆయన చెప్పిన సమాధానం వింటే దిమ్మ తిరిగిపోతుంది. సినిమాల్లేక ఖాళీగా ఉన్న హరీష్ శంకర్ ను పవన్ కళ్యాణ్ కు పరిచయం చేసింది నేను.. ఫాంహౌస్ లో ఆయన ఉంటే పని లేకుండా ఉన్న హరీష్ శంకర్ ను ఆయనతో కలిపించి సినిమా ఓకే చేయించింది నేను.. మిరపకాయ ఇష్టమా వర్కవుట్ కాకపోయినా వెంటనే గబ్బర్ సింగ్ వచ్చేలా చేశాను.. ఆ సంస్కారం ఆయనకు ఉండాలి.. కృతజ్ఞతాభావం ఆయనకు ఉండాలి.. హరీష్ శంకర్ కేవలం రీమేక్ సినిమాలు మాత్రమే చేయగలడు.. ఒక స్ట్రెయిట్ సినిమా తీసి హిట్ కొడితే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతాను అంటూ సవాల్ చేశాడు బండ్ల గణేష్. ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం కోటలు దాటుతుంది. మరి బండ్ల గణేష్ చేసిన సవాలుకు హరీష్ శంకర్ ఎలాంటి సమాధానం చెబుతాడో చూడాలి. 

More Related Stories