బీఎస్ఎస్‌9 సెట్లో గ్రాండ్‌గా జ‌రిగిన వి.వి.వినాయ‌క్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌.



VV Vinayak birthday celebrations on the sets of BSS9
2021-10-09 20:35:40

హ్యాపీనింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, స్టార్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న‌ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌కు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. స‌క్సెస్‌ఫుల్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్‌లో జ‌రుగుతుంది. ఈ రోజు ద‌ర్శ‌కుడు వి.వి. వినాయ‌క్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా బీఎస్ఎస్‌9 సెట్లో వి వి వినాయ‌క్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ గ్రాండ్‌గా జ‌రిగాయి. 

ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ నిర్మాత‌, వైజాగ్ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ ముఖ్య అతిథిగా హాజ‌రై వి.వి వినాయ‌క్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ పాల్గొన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, సాహిల్ వైద్‌, అమిత్ నాయ‌ర్‌, రాజేంద్ర గుప్తా, శివం పాటిల్‌, స్వ‌ప్నిల్‌, అశిష్ సింగ్‌, మ‌హ్మ‌ద్ మోనాజిర్‌, అరుషిక దే, వేదిక‌, జాస‌న్ త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. 

More Related Stories