చిరు లూసిఫర్ ముహూర్తం ఖరారుVinayak
2020-10-03 21:01:12

మాస్ దర్శకుడు వి.వి వినాయక్ మరోసారి మెగాస్టార్ తో సినిమా తీసే ఛాన్స్ కొట్టేశారు. మెగాస్టార్ తో వినాయక్ ఠాగూర్, ఖైదీనెం.150 సినిములకు కలిసి పనిచేశారు. కాగా ఈ రెండు సినిమాలు ఇండస్ట్రీలో ఎంత పెద్ద హిట్ చిత్రలుగా నిలిశాయో తెలిసిందే. ఇక ఇప్పుడు చిరు-వినాయక్ కాంబినేషన్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కించడానికి వినాయక్ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో చిరు మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను రీమేక్ చేయనున్నారు అనే వార్త చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పై ఓ క్లారిటీ వచ్చింది. చరణ్ కు లూసిఫర్ సినిమా తెగ నచ్చడంతో ఆయన సినిమా రైట్స్ ను కొనుకున్నారు. అంతే కాకుండా సినిమాను తెరకెక్కించే బాధ్యతను దర్శకుడు వినాయక్ కు అప్పగించారు. దాంతో వినాయక్ ప్రస్తుతం రచయిత ఆకుల శివ తో కలిసి తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథలో మార్పులు చేసారు.

ఇక ఇప్పటికే వినాయక్ మార్పులు చేసిన స్క్రిప్టుకు మెగాస్టార్ ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. జనవరిలో పూజ కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నట్టు సినీ వర్గాల్లో టాక్ కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిననీ సినిమా షూటింగ్ ను త్వరలోనే తిరిగి ప్రారంభించనున్నారు. మరోవైపు చిరు మెహర్ రమేష్ తో కూడా ఓ సినిమాను చేయడానికి ఒప్పున్నారు. రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ వరుస సినిమాలు చేస్తుండటంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు.
 

More Related Stories