మహేష్ బాబు-తమన్.. మధ్యలో ఫ్యాన్స్.. ఏది నిజం..ss
2020-01-21 02:14:30

ప్రస్తుతం టలీవుడ్ లో సంగీత దర్శకుడు తమన్ హవా నడుస్తోంది. రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో ఎక్కువగా తమనే మ్యూజిక్ అందించడం విశేషం. దాంతో ఎక్కడ చూసిన అతని పాటలే వినిపిస్తున్నాయి. వెంకిమామ, ప్రతిరోజు పండగే, అల వైకుంఠపురంలో.. ఈ నెల 24న విడుదలకు సిద్దమవుతున్న 'డిస్కోరాజా' ఇలా వరుస సినిమాలు తనవే కావడం.. అలాగే మరికొన్ని అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ తో దూకుడు మీదున్నాడు తమన్. అయితే.. ఇప్పుడు తమన్, మహేష్ బాబు ఫ్యాన్స్ కి అసలు పడటం లేదు.

ఇటీవల అల వైకుంఠపురంలో సక్సెస్ మీట్ లో త‌మ‌న్ చేసిన స్పీచ్‌ పై మ‌హేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తమ సినిమా గురించి నిజ‌మైన మాట‌లే చెప్తాం.. నిజ‌మైన‌ కలెక్షన్లే చెప్తాం.. ఈరోజు చెప్పాం.. గెలిచాం.. అంటూ చెప్పకొచ్చాడు. దాంతో త‌మ‌న్ మాట‌లు సరిలేరు నీకెవ్వరు సినిమాను ఉద్దేశించినవేనని.. మహేష్ ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అసలు తమన్ ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మహేష్ ఫ్యాన్స్ కి తమన్ కి మధ్య వార్ నడుస్తుంటే.. తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటికొచ్చింది.

అసలు విషయంలోకి వెళ్తే.. మహేష్ బాబుతో దూకుడు, బిజినెస్ మేన్, ఆగడు వంటి చిత్రాలకు సంగీతం అందించాడు తమన్. ఆ తర్వాత మళ్లీ వీళ్ల కాంబోలో సినిమా రాలేదు. అయితే ఇప్పుడు తమన్ ఫుల్ ఫామ్ లో ఉండడంతో.. మహేష్ నెక్ట్స్ సినిమాకు తమన్ ఫైనల్ అయినట్టు టాక్. వంశీ పైడిపల్లి-మహేష్ బాబు కొత్త సినిమాకి తమన్ ను అప్రోచ్ అయినట్టు సమాచారం. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దాంతో ఓ వైపు ఫ్యాన్స్ ఫైర్ అవుతుంటే ఈ న్యూస్ బయటికి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా.. నిజనిజాలేంటో ఇప్పుడే చెప్పలేమంటున్నారు.

 

More Related Stories