వార్ ఫస్ట్ డే కలెక్షన్స్...దుమ్ము రేపిన సూపర్ హీరోస్War Box Office Collection report
2019-10-03 11:44:09

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా వార్. ఈ సినిమా కూడా నిన్న గాంధీ జయంతి రోజునే రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా తెలుగులో సైరా లాగానే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టాప్ లేపింది. మొదటిరోజే దాదాపు 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో ఈ సినిమా అల్ టైం హైయెస్ట్ గ్రాస్సర్ రికార్డ్ దిశగా పోతుంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో పోటీ పడుతూ తెలుగులోనూ విడుదలైంది. 

తెలుగులో చిరంజీవిని బాక్సాఫీస్ వద్ద మరే బాలీవుడ్ హీరో బీట్ చేయలేరని తెలిసినా ఇక్కడ కూడా రిలీజ్ చేశారు.  సినిమా తొలిరోజే రూ.50 కోట్లు వసూలు చేసిందని బాక్సాఫీస్ ఇండియా వెబ్ సైట్ చెబుతోంది. హృతిక్, టైగర్ సినిమాపై ముందు నుంచీ అంచనాలు ఉన్నాయి. తొలిరోజు సినిమా రూ.55 కోట్ల వసూళ్లు రాబడుతుందని ఎప్పటినుంచో సినీ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ వారి అంచనాలను అందుకోలేకపోయినా చాలావరకు దగ్గరకు వచ్చింది. 

ఇక ఈ సినిమాకి నెటిజన్లు సహా క్రిటిక్స్ కూడా పాజిటివ్ రివ్యూలే ఇస్తున్నారు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ఎంట్రీ సీన్స్ హైలైట్‌గా నిలిచాయని అంటున్నారు. హిందీలో ఇప్పటివరకు 52కోట్ల మొదటిరోజు గ్రాస్ కలెక్షన్స్ తో అమిర్ ఖాన్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రం ఉంది. అయితే ఈ సినిమా ఆ సినిమాని దాటిందా లేదా అనేది అఫీషియల్ కలెక్షన్స్ ఇన్ఫర్మేషన్ వస్తే కానీ చెప్పలేము. యష్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ మూవీలో హీరోయిన్ గా వాణి కపూర్ నటించారు.

More Related Stories