వర్మకు ఏమైంది.. ఆయన ఎందుకిలా చేస్తున్నాడు..?rgv
2019-12-13 05:06:08

ఒక్కరికి కాదు అందరికీ వస్తున్న అనుమానం ఇదే ఇప్పుడు. అసలు వర్మకు ఏమైంది.. ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు..? ఒకప్పుడు ఎలాంటి సినిమాలు చేసిన దర్శకుడు ఇప్పుడు ఇలాంటి చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నాడు అంటూ అభిమానులే ఆయనపై ఫైర్ అవుతున్నారు. తాజాగా విడుదలైన అమ్మరాజ్యంలో కడపబిడ్డలు సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. అసలు ఈయనేంటి.. తలాతోక లేని ఇలాంటి సినిమాలు చేయడమేంటి అంటూ నోరెళ్లబెడుతున్నారు. కేవలం కారెక్టర్స్ మాత్రమే నమ్ముకుని ఈయన సినిమా చేసిన విధానం చూసి అంతా జాలి పడుతున్నారు. ముఖ్యంగా అసలు వర్మ ఇలాంటి సినిమాలు చేయడమేంటో అని కారణం తెలియక కంగారు పడుతున్నారంతా. సినిమాలో విషయం లేకపోగా కంటెంట్ బదులుగా అంతా కాంట్రవర్సీని నింపేసాడు ఈయన. దీనికి తోడు జగన్, చంద్రబాబు లాంటి పాత్రలతో ఇష్టమొచ్చినట్లు ఆడుకున్నాడు. ఇక పవన్, పాల్ కారెక్టర్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వాళ్లను కమెడియన్ల కంటే దారుణంగా చూపించాడు. నారా లోకేష్ అయితే మరీ దారుణం. ఆయన్ని చిన్నపిల్లాడి కంటే నీచంగా చూపించాడు వర్మ. పప్పు అంటూ సింబాలిక్ గా పదేపదే గుర్తు చేసాడు వర్మ. మొత్తానికి ఏదేమైనా కూడా అమ్మరాజ్యంలో కూడా దారుణంగా నిరాశపరచడం ఖాయంగా కనిపిస్తుంది.

More Related Stories