రవితేజకు ఏమైంది.. ఎందుకిలా చేస్తున్నాడు..rt
2020-03-14 14:09:32

మాస్ రాజా రవితేజకు ఏమైందని ఇప్పుడు అభిమానులు కూడా అడుగుతున్నారు. ఒకప్పుడు ఈయన వరస సినిమాలు చేసినా కూడా కనీసం పేరున్న దర్శకులతోనే చేసే వాడు. ఒకట్రెండు అవకాశాలు కొత్త వాళ్లకు.. ఫ్లాప్ ఇచ్చిన దర్శకులకు ఇచ్చినా కూడా మ్యాగ్జిమమ్ హిట్ దర్శకులతోనే పని చేసేవాడు రవితేజ. అనిల్ రావిపూడి వరకు కూడా ఇదే చేసాడు ఈయన. అయితే ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ రవితేజలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. కెరీర్ చివరిదశకు వచ్చేసిందని గమనించుకున్నాడో లేదంటే అవకాశాలు వచ్చినవి వచ్చినట్లు ఒప్పుకోవాలని ఫిక్సయ్యాడో తెలియదు కానీ వరసగా ఫ్లాప్ దర్శకులతో కూడా పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు మాస్ రాజా. అనిల్ రావిపూడి తర్వాత ఈయన పని చేసిన దర్శకుల లిస్ట్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. రాజా ది గ్రేట్ తర్వాత టచ్ చేసి చూడుతో విక్రమ్ సిరికొండకు చాన్సిచ్చాడు.. అది ఫ్లాప్. కళ్యాణ్ కృష్ణ కురసాల కూడా నేల టిక్కెట్టుతో డిజాస్టర్ ఇచ్చాడు.

విఐ ఆనంద్ డిస్కో రాజాతో ఫ్లాప్ ఇచ్చాడు. శ్రీనువైట్ల అమర్ అక్బర్ ఆంటోనీ అంటూ ఫ్లాపిచ్చాడు. ఇప్పుడు మళ్లీ ఫ్లాపుల్లోనే ఉన్న గోపీచంద్ మలినేనితో క్రాక్ సినిమా చేస్తున్నాడు ఈయన. దాంతో పాటే ఎప్పుడో ప్రేక్షకులు మరిచిపోయిన వీర దర్శకుడు రమేష్ వర్మతో సినిమా చేస్తున్నాడు. ఈయన గతేడాది రాక్షసుడు సినిమా చేసినా కూడా అది రీమేక్. మళ్లీ ఇప్పుడు వక్కంతం వంశీతో సినిమా చేస్తున్నాడు. నా పేరు సూర్య తర్వాత ఈయన్ని ఏ హీరో కూడా నమ్మలేదు. అలాంటి సమయంలో రవితేజ ఆఫర్ ఇస్తున్నాడు. ఇలా వరసగా ఫ్లాపుల్లో ఉన్న దర్శకులతోనే పని చేస్తూ అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు మాస్ రాజా

More Related Stories